IMD Weather Updates : అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలివే-imd predicts low pressure likely to form over bay of bengal by october 22 imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Imd Weather Updates : అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలివే

IMD Weather Updates : అక్టోబర్ 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలివే

Oct 17, 2024, 05:29 PM IST Maheshwaram Mahendra Chary
Oct 17, 2024, 05:29 PM , IST

  • AP Telangana Weather Updates: ఐఎండీ మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 22వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ కోస్తాంధ్ర మరియు దానిని అనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. 

(1 / 8)

ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అక్టోబర్ 20వ తేదీ కల్లా ఉపరిత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది అక్టోబర్ 22న నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించింది. వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతుందని తెలిపింది.  

(2 / 8)

ఏపీలో ఇవాళ(అక్టోబర్ 17) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 8)

ఇక రేపు(అక్టోబర్ 18) చూస్తే… శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(4 / 8)

తెలంగాణలో రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(5 / 8)

తెలంగాణలో రేపు( అక్టోబర్ 19 ) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(6 / 8)

తెలంగాణలో అక్టోబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, కామారెడ్డి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 

(7 / 8)

తెలంగాణలో 21వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే 22వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు