
(1 / 6)
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తాజా ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

(2 / 6)
ఏపీలో ఇవాళ(జూన్ 30) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 6)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(image source unsplash.com)
(4 / 6)
ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, మేడ్టల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(5 / 6)
జూలై 1వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవు.
(image source unsplash.com)
(6 / 6)
. ఆదివారం నుంచి బుధవారం వరకు బలమైన, స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(image source unsplash.com)ఇతర గ్యాలరీలు