దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- ఈ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​..-imd orange alert due to heavy rainfall in odisha kerala telangana rains ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- ఈ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​..

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- ఈ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​..

Aug 17, 2024, 09:46 AM IST Sharath Chitturi
Aug 17, 2024, 09:46 AM , IST

  • చురుకైన రుతుపవనాల కారణంగా, ఆగస్టు 17 శనివారం అనేక భారతీయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, ఛత్తీస్​గఢ్​, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆగస్టు 17, శనివారం దిల్లీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.

(1 / 5)

ఆగస్టు 17, శనివారం దిల్లీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.(HT_PRINT)

ఛత్తీస్​గఢ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (≥ 12 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

(2 / 5)

ఛత్తీస్​గఢ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (≥ 12 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.(PTI)

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, జార్ఖండ్, అస్సాంలో భారీ వర్షాలు (≥ 7 సెంటీమీటర్లు) కురుస్తాయని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో తెలిపింది.

(3 / 5)

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, జార్ఖండ్, అస్సాంలో భారీ వర్షాలు (≥ 7 సెంటీమీటర్లు) కురుస్తాయని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో తెలిపింది.(PTI)

శనివారం తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు, నాలుగు రోజులు వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది.

(4 / 5)

శనివారం తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు, నాలుగు రోజులు వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది.(AP)

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణాది రాయలసీమ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(5 / 5)

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణాది రాయలసీమ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు