AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్!-imd heavy rain alert to andhra pradesh districts depression may in bay of bengal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్!

AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్!

Aug 26, 2024, 12:00 PM IST Bandaru Satyaprasad
Aug 26, 2024, 12:00 PM , IST

  • AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.  జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

(1 / 6)

వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ  ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

(2 / 6)

సోమవారం మధ్యాహ్నం వరకు సముద్ర తీరప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

(3 / 6)

అంతర్వేది నుంచి పెరుమల్లాపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు, నెల్లూరు తీరం కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు, పశ్చిమగోదావరి తీరప్రాంతంలో అలలు అతివేగంతో వస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. హార్బర్లు, మెరైన్ కార్యకలాపాల్లో  మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

(4 / 6)

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 

(5 / 6)

ఉభయగోదావరి జిల్లాలు, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.  తీర వెంబడి ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచించారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు