AP TG Weather Updates : తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో వెదర్ ఎలా ఉంటుందంటే..?
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 8)
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరికొన్నిరోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
(HT Photo/Sakib Ali)(2 / 8)
ఉత్తర తమిళనాడు, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సగటున సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరమంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని వివరించింది.
(3 / 8)
ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
(4 / 8)
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరికొన్నిచోట్ల పొడి వాతావరణం ఏర్పడొచ్చని తెలిపింది.
(5 / 8)
ఇక తెలంగాణలో చూస్తే మరో నాలుగైదు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.
(6 / 8)
తెలంగాణలో ఈ రాబోయే ఈ 3 రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వతా సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది.
(7 / 8)
హైదరాబాద్ లో చూస్తే ఉదయం టైమ్ లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఉపరితల, ఈశాన్య దిశలో గంటకు 06 -08 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు