AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు-imd has predicted that a low pressure area is likely to form over the east central north bay of bengal by 29 august ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు

Aug 28, 2024, 10:26 AM IST Maheshwaram Mahendra Chary
Aug 28, 2024, 10:26 AM , IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఆగస్టు 29వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆగస్టు 29 నాటికి తూర్పు మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తదుపరి 2 రోజుల్లో ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీకి దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో  అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(1 / 6)

ఇవాళ ఏపీలో (ఆగస్టు 28) చూస్తే… పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(2 / 6)

శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

(3 / 6)

ఇవాళ హైదరాబాద్ లో చూస్తే తేలికపాటి లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల గాలులు నైరుతి దిశలో గంటకు 08- 12 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. 

(4 / 6)

ఇవాళ తెలంగాణలో వ్యాప్తంగా చూస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.  

(5 / 6)

ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు