AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్...! ఏపీకి IMD చల్లని కబురు, ఇవాళ, రేపు వర్ష సూచన
- AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఉత్తర కోస్తాతో పాటు యానాంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఉత్తర కోస్తాతో పాటు యానాంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.
(unsplash.com)(2 / 6)
ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఈ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
(unsplash.com)(3 / 6)
ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి వెళ్తుందని ఐఎండీ తెలిపింది. ఈ ద్రోణి తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు 0.9 కిమీ ఎత్తులో ఉందని పేర్కొంది.
(unsplash.com)(4 / 6)
సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తెలంగాణ మరియు పొరుగు ప్రాంతాలపై తుఫాను సర్కులేషన్ ఉందని ఐఎండీ తెలిపింది.
(unsplash.com)(5 / 6)
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పొడి వాతవరణమే ఉంటుందని... ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది.
(unsplash.com)ఇతర గ్యాలరీలు