AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు, ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్-imd alert depression forms in bay of bengal on august 29th heavy rain in telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Rains : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు, ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

AP TG Rains : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు, ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

Aug 27, 2024, 07:53 PM IST Bandaru Satyaprasad
Aug 27, 2024, 07:52 PM , IST

  • AP TG Rains : ఈ నెల 29 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం తెలిపింది. 29 నుంచి 31 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నెల 29 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం తెలిపింది. 29 నుంచి 31 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

(1 / 6)

ఉత్తర బంగాళాఖాతంలో గురువారం(ఆగస్టు 29న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలోకి చేరే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో శనివారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉందని పేర్కొంది. 

(2 / 6)

ఏపీలో రానున్న ఐదు రోజులు(27 నుంచి 31 వరకు) పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు(బుధవారం)పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

(3 / 6)

రేపు(ఆగస్టు 28)శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

(4 / 6)

ఐఎండీ తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

(5 / 6)

నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల , జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు