Krishna River: కృష్ణా నదిలో మరో నగరం… నది పొడవున అక్రమ నిర్మాణాలు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
- Krishna River: విజయవాడలో కృష్ణా నది తీరంలో మరో నగరం నిర్మాణం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో కనీవిని ఎరుగని రీతిలో అక్రమ నిర్మాణాలు నదీ గర్భంలో పెరిగిపోయాయి. విజయవాడ నగరంలోని యనమలకుదురు నుంచి తోట్లవల్లూరు వరకు నదిలో భారీగా నిర్మాణాలు వెలిశాయి.
- Krishna River: విజయవాడలో కృష్ణా నది తీరంలో మరో నగరం నిర్మాణం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో కనీవిని ఎరుగని రీతిలో అక్రమ నిర్మాణాలు నదీ గర్భంలో పెరిగిపోయాయి. విజయవాడ నగరంలోని యనమలకుదురు నుంచి తోట్లవల్లూరు వరకు నదిలో భారీగా నిర్మాణాలు వెలిశాయి.
(1 / 9)
విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్ కొండ దిగువన ఉన్న ప్రాంతంలో గతంలో దేావాదాయ భూములు ఉండేవి. ఇసుక తిన్నెలు పరుచుకుని ఉండేవి. ప్రస్తుతం అక్కడ భారీగా అపార్ట్మెంట్లు, ఇళ్లు వెలిశాయి. నగర శివార్లలో ఉన్న పంచాయితీల ఇష్టారీతిలో అనుమతులు మంజూరు చేయడంతో అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు జరిగాయి. నగరానికి దగ్గర్లో ఉండటంతో వాటి అనుమతులు పట్టించుకోకుండా జనం కొనేశారు.
(2 / 9)
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. నగరం తూర్పు వైపు ఉన్న వ్యవసాయ భూముల ధరలు భారీగా ఉండటంతో నదీ తీరంలో ఉన్న భూముల్లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ భూముల్లో కేవలం వ్యవసాయం చేయాల్సి ఉండగా ఏకంగా మరో నగరాన్ని తయారు చేశారు.
(3 / 9)
విజయవాడ నుంచి అవనిగడ్డకు వెళ్లే కరకట్ట మార్గంలో కుడి వైపున నది ఎఫ్టిఎల్ జోన్లో ఉంటుంది. నది ప్రవాహ సమయంలో నీరు ముంచెత్తకుండా కృష్ణానదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏకంగా భారీ నిర్మాణాలు వెలిశాయి.
(4 / 9)
నదిలో కలిసిపోయిన భవనాలు. ప్రకాశం బ్యారేజీ దిగువున వరద ప్రవాహం లేని సమయంలో సాగు అవసరాలకు మాత్రమే భూమిని వినియోగించాల్సి ఉండగా అందులో ఇళ్లు కట్టేశారు.
(5 / 9)
విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో అనధికారిక నిర్మాణాలు నదిలో జరిగినా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. ఈ నిర్మాణాలు గత పదేళ్లలోనే జరిగాయి.
(6 / 9)
విజయవాడ నగరానికి కుడివైపున ప్రవహించే కృష్ణానది నుంచి ముంపు రాకుండా ఉండేందుకు 60వ దశకంలోనే కృష్ణా కరకట్టల్ని నిర్మించారు. కరకట్టల లోపల నివాసాలు, శాశ్వత నిర్మాణాలు చేయకుండా ఆంక్షలు ఉన్నాయి. ఈ భూముల్లో వ్యవసాయానికి మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది.
(7 / 9)
రామలింగేశ్వర ఆలయం దిగువున కృష్ణా కరకట్ట దిగువన నదిలో ఏకంగా మరో నగరం తయారైంది. కట్ట పొడవున చోడవరం వరకు అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది. నదిలోకి వెళ్లి శాశ్వత నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వదిలేసింది. రెవిన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులు ముడుపులు స్వీకరించి భవనాలను అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి.
(8 / 9)
కృష్ణానది గర్భంలోకి చొచ్చుకు వెళ్లి చేపట్టిన నిర్మాణాలతో నది సహజ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్ల నిర్మాణం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారు.
ఇతర గ్యాలరీలు