(1 / 9)
టాలీవుడ్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందారు. ఇప్పటికీ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో టాలీవుడ్ హీరోయిన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం సాధారణ విషయమే.
(2 / 9)
కానీ, 2000ల దశకంలోనే టాలీవుడ్ హీరోయిన్ తొలిసారిగా రూ. 1 కోటి పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్‌గా పేరు కూడా సంపాదించుకుంది.
(3 / 9)
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ ఇలియానా డి క్రూజ్. రామ్ పోతినేని దేవదాస్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మహేశ్ బాబు పోకిరి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
(4 / 9)
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది ఇలియానా. అగ్ర హీరోలతో కలిసి నటించిన ఇలియానా 200లో తొలిసారిగా రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
(5 / 9)
మాస్ మహారాజా రవితేజ నటించిన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా తొలిసారిగా రూ. కోటి పారితోషికం అందుకుంది. కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇలియానా రెమ్యునరేషన్ విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
(6 / 9)
ఆ తర్వాత తరుణ్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే దొంగలు సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు కూడా ఇలియనా కోటి రెమ్యునరేషన్ అందుకుంది.
(7 / 9)
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఇలియానా ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లి. రీసెంట్‌గానే తనకు రెండో కుమారుడు జన్మించినట్లు బాబు పేరు కియాను రఫె డోలాన్ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పింది ఇల్లు బేబీ.
(8 / 9)
2023లో మే 13న మైఖేల్ డోలన్‌ను పెళ్లి చేసుకున్న ఇలియానా మొదటి కుమారుడు పేరు కోవా ఫీనిక్స్ డోలన్. ఇద్దరి బిడ్డలకు తల్లి అయిన ఇలియానా ఇప్పుడు భార్యగా, అమ్మగా కుటుంబంతో గడుపుతుంది.
(9 / 9)
ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. దాంతో ఇలియానా గ్లామర్ ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంటాయి.
ఇతర గ్యాలరీలు