తెలుగు న్యూస్ / ఫోటో /
Nayanatara: ప్రత్యేక జెట్ నాలుగు ఇళ్లు.. నయనతార ఆస్తులు తెలిస్తే మీరు అవాక్కవుతారు
Nayanatara: టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నయనతార నికర ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నయనతార ప్రస్తుతం ముంబైలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది.
(1 / 8)
లేడీ సూపర్ స్టార్ అని అభిమానులు పిలుచుకునే నయనతార జీవితం విజయాలు, వివాదాలతో నిండిపోయి ఉంటుంది.
(2 / 8)
విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయన్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. మొదట్లో కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిన నయన్ తరువాత ఎంటర్ ప్రెన్యూర్ గా మారింది. ఇప్పుడు ఆమె వివిధ ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్ చేసింది.
(3 / 8)
సినిమాలతో పాటూ ఆమె చేసే వ్యాపారాలు ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది నయనతార. ప్రస్తుతం నయన్ కు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని సమాచారం.
(5 / 8)
ఆ కథనం ప్రకారం నయన్ కు సుమారు 4 పెద్ద ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఒకటి చెన్నైలో ఉంది. దీని విలువ రూ.100 కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు.
(6 / 8)
ప్రస్తుతం నయన్ తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ముంబైలో నాలుగు పడక గదుల ఇంట్లో నివసిస్తోంది. అందులో స్విమ్మింగ్ పూల్, జిమ్ తో సహా అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆమెకు రెండు ఇళ్లు ఉన్నాయి. ఈ రెండింటి విలువ రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. లగ్జరీ కార్లకు కూడా కొదవలేదు. కోట్ల విలువైన కార్లు ఆమె దగ్గర ఉన్నాయి.
(7 / 8)
నయనతార దగ్గర ప్రత్యేక జెట్ కూడా ఉంది. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని అంటున్నారు. ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి తర్వాత నయనతార మాత్రమే ఈ సదుపాయాన్ని సొంతం చేసుకుంది. లిప్ బామ్ కాస్మోటిక్స్ లో రూ.10 కోట్లు, యూఏఈ ఆయిల్ బిజినెస్ లో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది నయన తార.
ఇతర గ్యాలరీలు