Chaitra Navarathrulu 2024: చైత్ర నవరాత్రుల్లో లవంగాలతో ఇలా చేస్తే అంతా కలిసొస్తుంది
Chaitra Navarathrulu 2024: పవిత్ర చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9న ప్రారంభమవుతున్నాయి . చైత్ర నవరాత్రుల్లో లవంగాలతో సింపుల్ రెమెడీస్ ఫాలో అయితే మీ ఇంటి సంపద పెరగడమే కాకుండా శత్రువులపై విజయం సాధిస్తారు.
(1 / 8)
ఏప్రిల్ 9 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి . చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే బలం, ఆనందం, శాంతి సౌభాగ్యాలను పొందే అవకాశం ఉంది. చైత్ర నవరాత్రుల సమయంలో, మీరు గ్రహ దోషాలను తొలగించడానికి, డబ్బు ఇబ్బందులను అధిగమించడానికి లేదా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి. ఈ సమయంలో లవంగాలతో చిన్న రెమెడీ పాటిస్తే ఆర్ధికంగా కలిసి వస్తుంది.
(2 / 8)
మీ రాశిచక్రంలో రాహు, కేతువుల దోషాల కారణంగా ఆందోళనలు ఎక్కువవుతూ ఉంటాయి. నవరాత్రులలో 9 రోజుల పాటు శివలింగానికి లవంగాలను సమర్పించండి. దీనివల్ల రాహు, కేతువుల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. ఈ రెండు గ్రహాలు ప్రశాంతంగా ఉంటాయి.(Freepik)
(3 / 8)
మొదలుపెట్టిన పనిని విజయవంతం అవ్వాలంటే, చైత్ర నవరాత్రులలో పూజ సమయంలో హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంతో రెండు లవంగాలను ఉంచండి. దీనివల్ల నెగిటివిటీ తొలగిపోయి పని విజయవంతమవుతుంది.
(4 / 8)
శత్రువులపై విజయం సాధించాలంటే చైత్ర నవరాత్రుల సమయంలో హనుమంతుడికి లడ్డూలు సమర్పించండి. హనుమాన్‌ను 7 సార్లు పఠించి, 5 లవంగాలతో కర్పూరాన్ని వెలిగించండి . ఆ రోజు బూడిదతో బొట్టు పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.
(5 / 8)
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే 5 పసుపు కొమ్ములు , 5 లవంగాలను ఎర్రటి వస్త్రంలో కట్టాలి. ఆ ముడుపును డబ్బు స్థానంలో ఉంచండి. అలాగే, పసుపు వస్త్రంలో రెండు లవంగాలను కట్టి పూజా చేసే స్థలంలో భద్రంగా ఉంచండి . ఇది పేదరికాన్ని నిర్మూలిస్తుంది.(Freepik)
(6 / 8)
పనిలో విజయం కోసం, చైత్ర నవరాత్రులలో నూనె దీపాలతో శ్రీ హనుమంతుడికి హారతి ఇవ్వండి. అందులో రెండు లవంగాలు వేయాలి. దీపంలో మల్లె లేదా ఆవనూనె వాడవచ్చు .
(7 / 8)
ఇంట్లో సుఖసంతోషాల కోసం దుర్గామాతను పూజించేటప్పుడు రెండు లవంగాలను సమర్పించండి. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు