Vastu Tips For Money: డబ్బుతో పాటు ఈ వస్తువులను కలిపి ఉంచారంటే.. ఆర్థిక నష్టం గ్యారెంటీ! అని వాస్తు శాస్త్రం చెబుతోంది
Vastu Tips For Money: ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే, ఆకస్మిక ధన నష్టం కలిగిందంటే దానికి కారణం మీరు డబ్బుతో పాటు కొన్ని వస్తువులను కలిపి ఉంచడం అయి ఉండచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బునూ, వీటిని ఒకేచోట ఉంచారంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట! అదేంటో తెలుసుకోండి మరి.
(1 / 6)
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సమృద్ధిగా ఉండాలంటే, ఆకస్మిక ధన నష్టం రావద్దంటే కొన్ని వస్తువులను డబ్బుతో పాటు ఉంచకూడదని సూచిస్తారు. వాస్తు నిబంధనల ప్రకారం సంపద, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలన్ని చూపే వస్తువులేంటో చూద్దాం.
(2 / 6)
పాత, చిరిగిపోయిన నోట్లు, ఉపయోగంలో లేని నాణేలను పర్సులో లేదా ఇంట్లోని బీరువాలో డబ్బుతో పాటు కలిపి ఉంచకూడదు. ఇవి ఆర్థిక లాభానికి ఆటంకాలు కలిగిస్తాయి.
(3 / 6)
వాస్తు నిబంధనల ప్రకారం.. విత్తనాలు లేదా ధాన్యాలు డబ్బుతో ఉంచడం ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తుంది. ఇవి పెరిగే ప్రాపర్టీని అంగీకరించవు. ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయి.
(4 / 6)
పగిలిన గ్లాస్, తెగిపోయిన ఆభరణాలు వంటి వస్తువులను డబ్బుతో కలిపి ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఇవి దోపిడీ లేదా ఆర్థిక నష్టాన్ని సూచిస్తాయి.
(5 / 6)
పెన్నులు, కత్తులు, విరిగిపోయిన వస్తువులు వంటి పదునైన వాటిని డబ్బుతో కలిపి ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇది ఆర్థిక సంక్షోభానికి లేదా అదృష్ట నష్టానికి దారి తీస్తుంది.
ఇతర గ్యాలరీలు