High BP: అధిక రక్తపోటు ఉన్న వారు ప్రతిరోజూ ఈ రసాలను తాగితే బీపీ తగ్గడం ఖాయం
High BP: మీకు అధిక రక్తపోటు ఉంటే కొన్ని రకాల జ్యూసులను తాగడం అలవాటు చేసుకోండి. దీంతో హైబీపీ సమస్య అదుపులోకి వస్తుంది. అధిక రక్తపోటుతో పాటు, ఈ రసాలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి.
(1 / 7)
నిశ్చల జీవనశైలి, ఆహారం కారణంగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అధిక రక్తపోటు నుండి బయటపడాలంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీనితో పాటు కొన్ని పండ్ల తాజా జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు.
(2 / 7)
ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్
ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ నేచురల్ గా తగ్గుతుంది.
(3 / 7)
దానిమ్మ రసం
2017 అధ్యయనం ప్రకారం, దానిమ్మ రసం సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, దానిమ్మ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
(4 / 7)
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్స్ ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే నేచురల్ కెమికల్స్ శరీరం నైట్రేట్లను నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.
(5 / 7)
టమోటో జ్యూస్
ఉప్పు వేసుకోకుండా టమోటా జ్యూస్ ను తాగితే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. జపాన్ లో నిర్వహించిన 2019 అధ్యయనంలో టమోటా జ్యూస్ ను ఏడాది పాటు నిరంతరాయంగా తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది.
(6 / 7)
క్రాన్బెర్రీ జ్యూస్ మరియు చెర్రీ
2020 అధ్యయనం ప్రకారం, క్రాన్బెర్రీ, చెర్రీ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 432 మిల్లీలీటర్ల క్రాన్ బెర్రీ జ్యూస్ ను 8 వారాల పాటు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
ఇతర గ్యాలరీలు