
(1 / 5)
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీవ్రం...తెలుగులో ఆక్రందన పేరుతో డబ్ అయ్యింది. తెలుగులో ఈ మూవీ 1.5 మిలియన్లకుపైగా వ్యూస్‌ను రాబట్టింది.

(2 / 5)
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించిన హెవెన్ మూవీ తెలుగులో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నది.

(3 / 5)
మోహన్‌లాల్, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఇద్దరూ ఇద్దరూ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. మలయాళం మూవీ లైలా ఓ లైలాకు అనువాదంగా రిలీజైన ఈ మూవీ తెలుగులో ఏకంగా 6.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది.

(4 / 5)
నీరలి మలయాళంలో బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అక్టోఫస్ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో మోహన్‌లాల్, నదియా హీరోహీరోయిన్లుగా నటించారు.

(5 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం మూవీ ది ట్రైన్ అదే పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో జయసూర్య మరో హీరోగా నటించాడు.
ఇతర గ్యాలరీలు