(1 / 5)
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023-25 సైకిల్ కు 5.76 మిలియన్ డాలర్లు (రూ.49.27 కోట్లతో) ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. గతంలో కంటే ఇది రెండింతలు.
(x/ThomasLyte)(2 / 5)
జూన్ 11న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య లార్డ్స్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇందులో గెలిచిన టీమ్ గదతో పాటు 3.6 మిలియన్ డాలర్లు (రూ.30.80 కోట్లు) సొంతం చేసుకుంటుంది. 2021, 2023లో ఇచ్చిన 1.6 మిలియన్ డాలర్ల (రూ.13.67 కోట్ల) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.
(Action Images via Reuters)(3 / 5)
డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 రన్నరప్ టీమ్ 2.16 మిలియన్ డాలర్లు (రూ.18.48 కోట్లు) ఖాతాలో వేసుకుంటాయి. గతంలో రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.84 కోట్లు) ఇచ్చేవాళ్లు.
(x/icc)(4 / 5)
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయిన టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్ 1.44 మిలియన్ డాలర్లు (రూ.12.32 కోట్లు) సొంతం చేసుకుంటుంది. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ 1.20 మిలియన్ డాలర్లు దక్కించుకుంటుంది.
(x/bcci)(5 / 5)
ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఫైనల్ బరిలో దిగుతోంది. దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతోంది. భారత్ లేకుండా తొలిసారి ఈ టైటిల్ పోరు జరగబోతోంది. 2021, 2023 ఫైనల్లో ఆడిన భారత్.. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది.
(x/ProteasMenCSA)ఇతర గ్యాలరీలు