తెలుగు న్యూస్ / ఫోటో /
Nitish Kumar Reddy: వారు తప్పని నిరూపించాలని అనుకున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
- Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత స్టార్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం చేశాడు. ఈ విషయంపై నేడు (డిసెంబర్ 29) మీడియాతో అతడు మాట్లాడాడు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
- Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత స్టార్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం చేశాడు. ఈ విషయంపై నేడు (డిసెంబర్ 29) మీడియాతో అతడు మాట్లాడాడు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
(1 / 5)
భారత యంగ్ బ్యాటర్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి.. అరంగేట్రం చేసిన తొలి సిరీస్‍లోనే.. ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసి అదరగొట్టాడు. ఆసీస్‍తో మెల్‍బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో అద్భుత సెంచరీ చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. ఈ టెస్టు నాలుగో రోజు ఆట ముగిశాక నేడు (డిసెంబర్ 29) మీడియాతో నితీశ్ మాట్లాడాడు.
(2 / 5)
ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‍లో నితీశ్ కుమార్‌ను ఎంపిక చేయడం సరికాదని ముందు కొందరు విశ్లేషకులు, మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అతడికి భారత తుదిజట్టులో చోటు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై నితీశ్ రెడ్డి స్పందించాడు.(AP)
(3 / 5)
బిగ్ సిరీస్‍లో తాను పర్ఫార్మ్ చేయలేనని సందేహించిన వారు తప్పు అని నిరూపించాలని అనుకున్నానని నితీశ్ చెప్పాడు. తన బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు మూడేళ్లుగా చాలా కష్టపడ్డానని అన్నాడు. (AFP)
(4 / 5)
“నాపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ నుంచి వచ్చిన యంగ్ ప్లేయర్.. ఇలాంటి పెద్ద సిరీస్‍లో పర్ఫార్మ్ చేయలేడని అన్నారు. నేను వారిని తప్పు అని నిరూపించాలని అనుకున్నా. భారత జట్టు కోసం నేను 100 శాతం ఇచ్చేందుకు నేను ఇక్కడ ఉన్నానని వారికి తెలియజేయాలని అనుకుంటున్నా” అని నితీశ్ కుమార్ అన్నాడు.(AP)
(5 / 5)
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 189 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సిరీస్‍లోనే శతకం చేశాడు. ఎనిమిదో స్థానంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‍కు వచ్చి ఫాలోఆన్ ఎదురుకాకుండా కాపాడాడు. సుందర్ (50)తో కలిసి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. (AFP)
ఇతర గ్యాలరీలు