Akshay Kumar on Kannappa: కన్నప్ప చిత్రాన్ని రెండుసార్లు తిరస్కరించా.. కానీ: అక్షయ్ కుమార్-i refused to play lord shiva role in kanappa movie twice says akshay kumar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Akshay Kumar On Kannappa: కన్నప్ప చిత్రాన్ని రెండుసార్లు తిరస్కరించా.. కానీ: అక్షయ్ కుమార్

Akshay Kumar on Kannappa: కన్నప్ప చిత్రాన్ని రెండుసార్లు తిరస్కరించా.. కానీ: అక్షయ్ కుమార్

Published Feb 27, 2025 09:54 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 27, 2025 09:54 PM IST

  • Akshay Kumar on Kannappa: కన్నప్ప చిత్రంలో నటించేందుకు తాను ముందు తిరస్కరించానని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తెలిపారు. కన్నప్ప టీజర్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం వస్తోంది. ఈ మైథలాజికల్ మూవీలో శివుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించారు. ఈ సినిమా నుంచి టీజర్ మార్చి 1న రిలీజ్ కానుంది. అంతకు ముందే నేడు ముంబైలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా హిందీ టీజర్ ప్రదర్శన జరిగింది. 

(1 / 5)

కన్నప్ప టీజర్ ఈవెంట్‍లో అక్షయ్ కుమార్ మాట్లాడారు. తాను ఈ మూవీని ముందు రెండుసార్లు తిరస్కరించానని అన్నారు. ఆ తర్వాత ఎందుకు ఓకే చెప్పానో కూడా వెల్లడించారు.

(2 / 5)

కన్నప్పలో శివుడి పాత్ర చేసేందుకు ముందు రిజెక్ట్ చేశానని, కానీ తానే సరిపోతానని విష్ణు నచ్చజెప్పటంతో అంగీకరించానని అక్షయ్ తెలిపారు. “నేను ఈ ఆఫర్‌ను రెండుసార్లు రిజెక్ట్ చేశా. ఈ పాత్రకు నేనే సరిపోతానని విష్ణు అనుకున్న విధానం.. నేను అంగీకరించేలా చేసింది” అని అక్షయ్ తెలిపారు. 

(3 / 5)

కన్నప్ప సినిమా స్టోరీ చాలా పవర్‌ఫుల్ అని, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని అక్షయ్ చెప్పారు. ఓఎంజీ 2 చిత్రంలోనూ శివుడిగా అక్షయ్ నటించారు. అప్పట్లో కొన్ని అంశాలపై విమర్శలు వచ్చాయి. అందుకే కన్నప్ప చిత్రంలో శివుడిగా చేసేందుకు అక్షయ్ ముందుగా ఆలోచించి ఉండొచ్చు. విష్ణు నచ్చజెప్పటంతో అంగీకరించినట్టుగా అక్షయ్ చెప్పారు. 

(4 / 5)

కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు కూడా నటించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ మూవీని మోహన్ బాబు నిర్మించారు.

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు