Naga Chaitanya: శోభితను ఇంట్లో అలానే పిలుస్తా: నాగచైతన్య-i call sobhita dhulipala as bujji thalli in house says naga chaitanya at thandel pre release event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Naga Chaitanya: శోభితను ఇంట్లో అలానే పిలుస్తా: నాగచైతన్య

Naga Chaitanya: శోభితను ఇంట్లో అలానే పిలుస్తా: నాగచైతన్య

Feb 02, 2025, 10:52 PM IST Chatakonda Krishna Prakash
Feb 02, 2025, 10:52 PM , IST

  • Naga Chaitanya: తన భార్య, నటి శోభితా ధూళిపాళ్లను తాను ముద్దుగా ఏమి పిలుస్తారో వెల్లడించారు హీరో నాగచైతన్య. తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ విషయాన్ని చెప్పారు.

తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 2) జరిగింది. ఈ ఈవెంట్‍లో తన భార్య శోభితా ధూళిపాళ్ల గురించి వచ్చిన ప్రశ్నలకు నాగచైతన్య సమాధానాలు ఇచ్చారు. ఆమెను ఏమని పిలుస్తారో చెప్పేశారు. 

(1 / 6)

శోభితకు ఏదైనా పాట, డైలాగ్ డెడికేట్ చేయాలని నాగచైతన్యను యాంకర్ సుమ అడిగారు. దీంతో బుజ్జితల్లి పాటను శోభితకు డెడికేట్ చేస్తానని చైతూ చెప్పారు. 

(2 / 6)

తాను ఇంట్లో శోభితను బుజ్జితల్లి అనే పిలుస్తానని నాగచైతన్య వెల్లడించారు. తండేల్ చిత్రం ముందు నుంచే తాను శోభితను అలా పిలుస్తున్నానని అన్నారు. తండేల్ చిత్రం నుంచి వచ్చిన బుజ్జితల్లి సాంగ్ చాలా పాపులర్ అయింది. మూవీకి మంచి బజ్ తీసుకొచ్చింది. 

(3 / 6)

శోభిత ఫొటోను చూసి.. “బుజ్జితల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే” అంటూ డైలాగ్ చెప్పారు నాగచైతన్య. తండేల్ మూవీలో బుజ్జితల్లి పాత్ర పోషించారు సాయిపల్లవి.

(4 / 6)

నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు. 

(5 / 6)

నాగచైతన్య, శోభితా వివాహం 2024 డిసెంబర్ 4వ తేదీన జరిగింది. సమంతతో నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు చైతూ. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు