TS Rains : తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు, పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- TS Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- TS Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
(1 / 6)
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్, లక్ష్మమ్మ మృతి చెందగా, బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు మృతి చెందాడు.
(2 / 6)
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, జవహర్‌నగర్, సుచిత్ర, జీడీమెట్ల, కొంపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు పలుచోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.
(3 / 6)
తెలంగాణలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
(4 / 6)
ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్ , వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
(5 / 6)
ఈ నెల 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్,వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు