Srikakulam Special Trains: కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6 సర్వీసులు-hyderabad to srikakulam six special trains on sankranti 2025 rush scr announced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Srikakulam Special Trains: కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6 సర్వీసులు

Srikakulam Special Trains: కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6 సర్వీసులు

Jan 06, 2025, 10:12 PM IST Bandaru Satyaprasad
Jan 06, 2025, 10:12 PM , IST

Srikakulam Special Tains : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాచిగూడ/చర్లపల్లి స్టేషన్ల నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఆరు ప్రత్యేక సర్వీసులు జనవరి 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో నడపనున్నారు.

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఏపీలోని శ్రీకాకుళానికి ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఆరు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. 

(1 / 6)

జనవరి 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం రోడ్‌ మధ్య స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 8, 9 తేదీల్లో రెండు రైళ్లు సర్వీసులు నడపనున్నారు. 

(2 / 6)

రైలు నెంబర్ 07615, కాచిగూడ-శ్రీకాకుళం రోడ్‌... జనవరి 11, 15 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. జనవరి 12, 16 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు రైలు బయలుదేరి ఆ తర్వాతి రోజు ఉదయం 7.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలులో అన్ని థర్డ్ ఏసీ బోగీలే ఉంటాయి. 

(3 / 6)

కాచిగూడ-శ్రీకాకుళం రోడ్‌ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

(4 / 6)

రైలు నెంబర్ 07617 చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్‌ ప్రత్యేక రైలు...జనవరి 8న చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్‌- చర్లపల్లి (07618) ప్రత్యేక రైలు.. జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీకాకుళం రోడ్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 

(5 / 6)

చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలులో ఫస్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపిది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు