Hyderabad To Andhra Routes : హైదరాబాద్ టు ఆంధ్రా సంక్రాంతి ప్రయాణాలు, ఈ రూట్లలో వెళ్తే ట్రాఫిక్ లో చిక్కుకోరు!
Hyderabad To Andhra Routes : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి రద్దీ పెరిగింది. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ వాహన మార్గాలు సూచించారు.
(1 / 7)
హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణాలు మొదలయ్యాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
(2 / 7)
చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్ బూత్‌ల ద్వారా ఆంధ్రా వైపు వెళ్తోన్న వాహనాలను పంపిస్తున్నారు. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్‌పాస్ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ పెరిగింది.
(3 / 7)
ఇవాళ, రేపు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్ లు, ఎల్బీ నగర్ చౌరస్తా రద్దీగా మారాయి.
(4 / 7)
ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా తొందరగా వెళ్లేందుకు ఏపీ వైపు వెళ్లే వాహనదారులకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. పెద్ద అంబర్ పేట్ (EXIT-11) నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.
(5 / 7)
ఘట్కేసర్ (EXIT-9) నుంచి భువనగిరి-వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని పోలీసులు వాహనదారులకు సూచించారు. గుంటూరు వైపు వెళ్లేవాళ్లు బొంగులూరు [EXIT-121] గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్ - దేవరకొండ మీదుగా గుంటూరు చేరుకోవచ్చని తెలిపారు.
(6 / 7)
హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్లు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు