(1 / 6)
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది.
(2 / 6)
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
(3 / 6)
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
(4 / 6)
రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
(5 / 6)
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
(6 / 6)
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు చేసేందుకు నిర్ణయించింది. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలను తీర్చిదిద్ది, అక్కడే మూడో తరగతి వరకూ బోధన అందించేందుకు ఒక టీచర్ ను నియమించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇతర గ్యాలరీలు