తెలుగు న్యూస్ / ఫోటో /
Chandrababu On Ramoji Rao : రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ, ప్రజాచైతన్యం కోసం రాజీలేని పోరాటం- చంద్రబాబు
- Chandrababu On Ramoji Rao : యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు రామోజీ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు.
- Chandrababu On Ramoji Rao : యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు రామోజీ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు.
(1 / 7)
యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.
(2 / 7)
హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
(3 / 7)
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....‘రామోజీరావు మృతి బాధాకరం. రామోజీరావు నాకు 40 ఏళ్లుగా సుపరిచితులు. అనునిత్యం తెలుగు జాతి కోసం, సమాజ హితం కోసం ఆయన కృషి చేశారు. మామూలు గ్రామంలో జన్మించిన ఆయన అసాధారణ విజయాలు సాధించారు...వ్యవస్థలను నిర్మించారు' అని అన్నారు.
(4 / 7)
రామోజీరావు మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలతో ప్రజలకు చేరువయ్యారని చంద్రబాబు అన్నారు. ఏ ఇంట్లోనైనా నిద్ర లేవగానే ఈనాడు చదవితేనే బయటకు వస్తారని, ప్రజల్ని చైతన్య పరచడానికి రాజీలేని పోరాటం చేశారన్నారు. తాను చెప్పినట్లుగానే రామోజీరావు ధర్మం వైపు నిలబడి మంచి కోసం పని చేశారన్నారు. చనిపోయే వరకు అనునిత్యం పని చేసి...పనిలో ఉండగా చనిపోతేనే ఆనందంగా ఉంటుందని కోరుకున్న వ్యక్తి ఆయన అన్నారు.
(5 / 7)
రామోజీరావు స్థాపించిన ఈనాడు, ఈటీవీ, ఇతర సంస్థలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. మీడియా రంగంలోనే కాకుండా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారన్నారు.
(6 / 7)
ఫిల్మిం సిటీ వల్ల హైదరాబాద్ లో టూరిజం పెరిగి రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. అలాంటి ఆలోచనలు చేసిన మహావ్యక్తి దూరమవ్వడం బాధాకరమన్నారు. తెలుగుజాతి వెలుగు రామోజీరావు అని, తెలుగుజాతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారన్నారు. రామోజీరావు లేకపోయినా ఆయన రగిల్చిన స్ఫూర్తి అందరిలో ఉంటుందన్నారు. అనేక సందర్భాల్లో రామోజీరావుతో చర్చించి తాను నిర్ణయాలు తీసుకున్నానని చంద్రబాబు కొనియాడారు.
(7 / 7)
రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరుపున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. ఆదివారం నాటి కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ హాజరవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున రామోజీరావు పార్థివ దేహంపై పుష్ప గుచ్ఛం సమర్పించి నివాళి అర్పించనున్నారు.
ఇతర గ్యాలరీలు