తెలుగు న్యూస్ / ఫోటో /
Aramghar Zoo Park Flyover : హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు చెక్, రేపు ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం
Aramghar Zoo Park Flyover : హైదరాబాద్ లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రేపు(సోమవారం) సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.
(1 / 6)
హైదరాబాద్ లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రేపు(సోమవారం) సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.
(2 / 6)
హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.08 కి.మీ పొడవునా దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది.
(3 / 6)
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ వ్యూహాత్మకరహదారులను అభివృద్ధి చేస్తుంది.
(4 / 6)
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్ లు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తుంది బల్దియా. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.800 కోట్లతో చేపట్టిన ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద పైవంతెన కావడం గమనార్హం.
(5 / 6)
ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఆరు లేన్లలో నిర్మించారు. రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు. ఫ్లైఓవర్ ప్రారంభంతో...ముఖ్యంగా ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివ్రాంపల్లి, హసన్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
ఇతర గ్యాలరీలు