Hyderabad Sadar Utsavalu : హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు, ఇక నుంచి అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటన
Hyderabad Sadar Utsavalu : హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
(1 / 6)
హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
(2 / 6)
సదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
(3 / 6)
హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని గుర్తుచేశారు. ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారన్నారు.
(4 / 6)
ఇప్పుడు మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలన్నారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడని, అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచిందన్నారు. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దామని పిలుపునిచ్చారు.
(5 / 6)
ఏ శక్తులు అడ్డొచ్చినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తామన్నారు. రాబోయే రోజుల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
ఇతర గ్యాలరీలు