Hyderabad Rains : హైదరాబాద్ లో వర్ష బీభత్సం, ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు!
- Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వాతావరణ మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
- Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వాతావరణ మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
(1 / 6)
హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వాతావరణ మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
(2 / 6)
హైదరాబాద్ లో ఈదురుగాలుల దాటికి చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయంజాల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.
(3 / 6)
హయత్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.
(4 / 6)
రాష్ట్రానికి పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఆగ్నేయ రాజస్థాన్‌లో ప్రారంభమై ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగి బలహీనపడిందని తెలిపారు.
(5 / 6)
ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులు, వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది.
ఇతర గ్యాలరీలు