తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Near Hill Stations : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ కు సమీపంలోని హిల్ స్టేషన్లు ఇవే?
- Hyderabad Near Hill Stations : ఈ సమ్మర్ కాస్త డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ సమీపంలోని హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం.
- Hyderabad Near Hill Stations : ఈ సమ్మర్ కాస్త డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ సమీపంలోని హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం.
(1 / 6)
ఈ ఏడాది సమ్మర్ కాస్త డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్(Hyderabad Near Hill Stations) సమీపంలోని హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం. సిటీ లైఫ్ నుంచి కాస్త ప్రశాంతంగా సెలవులను(Summer Holidays) ఎంజాయ్ చేసేందుకు ఈ ట్రిప్ ఉపయోగపడుతుంది. మిమల్ని మంత్రముగ్ధులను చేసే జలపాతాలు, విశాలమైన తోటలు సాహసోపేత ట్రెక్కింగ్ ఈ హిల్ స్టేషన్ల ప్రత్యేకం.
(2 / 6)
హార్సిలీ హిల్స్- హార్సిలీ హిల్స్(Horsley Hills) వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు అనువైన ప్లేస్. ఈ కొండలకు కడప జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డబ్ల్యుడీ హార్సిలీ పేరు పెట్టారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, సుందరమైన దృశ్యాలు హార్సిలీ హిల్స్ ను పర్యాటక కేంద్రంగా(Tourist Place) మార్చాయి. విస్పర్ విండ్స్ వ్యూ పాయింట్, హార్సిలీ హిల్స్ జూ, కైగల్ జలపాతం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు. హార్సిలీ హిల్స్ ఏపీ అన్నమయ్య జిల్లా మందనపల్లెకి 9 మైళ్ల దూరంలో ఉన్నాయి.
(3 / 6)
అనంతగిరి హిల్స్ - అనంతగిరి కొండలు(Anantagiri Hills) కాఫీ తోటలు, సుందరమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి కొండలు, లోయలు, కొండల మధ్య నుంచి మూసీ నది పర్యాటకులను కట్టిపడేస్తాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్‌కు అనువైన ప్లేస్. అనంతగిరి హిల్స్ ఫారెస్ట్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అనంతగిరి హిల్స్ వ్యూపాయింట్ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో ఉంది.
(4 / 6)
అరకు లోయ - అరకు లోయ(Araku Valley) తూర్పు కనుమలలో సుందరమైన హిల్ స్టేషన్. అరకు లోయ కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చని అడవులకు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు అరకులోయ అనువైన ప్రదేశం. ఇక్కడ గిరిజన మ్యూజియం, కటికి జలపాతాలు, బొర్రా గుహలు చూడదగిన ప్రదేశాలు. విశాఖ నుంచి 114 దూరంలో అరకు లోయ ఉంది.
(5 / 6)
నల్లమల కొండలు - నల్లమల కొండలు(Nallamala Hills) ఏపీ, తెలంగాణలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండలలో శ్రీశైలం అభయారణ్యం ఉంది. భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో శ్రీశైలం ఒకటి. ఇక్కడ శ్రీశైలం ఆలయం, రోప్ వే, బోటింగ్ చూడదగిన ప్రదేశాలు. నల్లమల కొండలు హైదరాబాద్ నుంచి 85 కి.మీ దూరంలో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు