(1 / 7)
హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ప్రయాణ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
(2 / 7)
మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంచుతూ ఇటీవల ఎల్ అండ్ టీ మెట్రో తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.దీంతో ధరలపై డిస్కౌంట్ ప్రకటించారు.
(istockphoto)(3 / 7)
గత వారం మెట్రో ప్రయాణ ఛార్జీలలో డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎల్ అండ్ టి ప్రకటించింది. 2కి.మీ కనిష్ట ప్రయాణానికి కనీస ధరగా రూ.11 ఛార్జీని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణానికి గరిష్టంగా రూ.69ఛార్జీ నిర్ణయించారు. ఇవి శనివారం నుంచి అమల్లోకి వస్తాయి.
(4 / 7)
హైదరాబాద్ మెట్రలో ప్రయాణ ఛార్జీలను 20శాతం పెంచాలని నిర్ణయించినా వ్యతిరేకత రావడంతో పదిశాతానికి తగ్గించారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.11 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రెండు నుంచి 4 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.17 ఛార్జీ వసూలు చేస్తారు.
(5 / 7)
మెట్రోలో 4 నుంచి ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.28, 6 నుంచి 9 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.37 ఛార్జీ వసూలు చేస్తారు. 12 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.51 ఛార్జీ వసూలు చేస్తారు. 15 నుంచి 18 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.56 వసూలు చేస్తారు.
(6 / 7)
18 నుంచి 21 మీటర్ల ప్రయాణానికి రూ.61, 21 నుంచి 24 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.65 వసూలు చేస్తారు. గరిష్టంగా రూ.69 ఛార్జీ చేస్తారు.
(@Kavalichandrak1)(7 / 7)
మెట్రో ప్రయాణ ఛార్జీలను కనీసం రూ.10 నుంచి 12కు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచాలని మెట్రో యాజమాన్యం భావించింది. తర్వాత దానిలో 10శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
(X/Peter Chirkov)ఇతర గ్యాలరీలు