Ramoji Rao Demise : రామోజీరావు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు- రేపు ఉదయం అంత్యక్రియలు-hyderabad media mogul ramoji rao passed away in film political leaders pays tribute final rites tomorrow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ramoji Rao Demise : రామోజీరావు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు- రేపు ఉదయం అంత్యక్రియలు

Ramoji Rao Demise : రామోజీరావు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు- రేపు ఉదయం అంత్యక్రియలు

Jun 08, 2024, 03:42 PM IST Bandaru Satyaprasad
Jun 08, 2024, 03:42 PM , IST

  • Ramoji Rao Demise : తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీ రావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీ రావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో సందర్శనార్థం ఉంచారు. మీడియా మోఘల్ రామోజీరావుకు కడసారి నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిల్మిం సిటీకి తరలివస్తున్నారు. 

(1 / 8)

రామోజీరావు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు నివాళులు అర్పించారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు...ఫిల్మిం సిటీకి చేరుకుని రామోజీరావు పార్థివదేహం వద్ద కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 

(2 / 8)

రామోజీరావు ఒక విజనరీ, మొబైల్ ఎన్ సైక్లోపిడియా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఆయన... రామోజీ మరణం తెలుగు వారికి తీరని లోటు అన్నారు. 

(3 / 8)

తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావుకు ప్రత్యేక్షంగా, సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 

(4 / 8)

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులు టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఏపీ వ్యాప్తంగా రామోజీరావుకు నివాళులర్పించాలని టీడీపీ పిలుపు నిచ్చింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గ్రామాల్లో సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది.   

(5 / 8)

రామోజీరావు అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

(6 / 8)

రామోజీరావు పార్థివ దేహానికి యాంకర్ ప్రదీప్ నివాళులు 

(7 / 8)

రామోజీరావు పార్థివ దేహానికి యాంకర్ ప్రదీప్ నివాళులు 

రామోజీరావు పార్థివ దేహానికి హీరో మంచు మనోజ్ నివాళులు 

(8 / 8)

రామోజీరావు పార్థివ దేహానికి హీరో మంచు మనోజ్ నివాళులు 

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు