
(1 / 6)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport Runway) రన్ వే పై చిరుత(Leopard) కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు.
(Pexel)
(2 / 6)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై వన్యప్రాణి సిబ్బంది, జూ అధికారులు ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు. చిరుత కోసం రన్ వే పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు.

(3 / 6)
ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడ దూడి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.
(Pexel)
(4 / 6)
చిరుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లు తగలడంతో కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు గుర్తించారు.

(5 / 6)
చిరుతతో పాటు రెండు పిల్లలు ఉన్నట్లు ఎయిర్ పోర్టు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.
(Pexel)
(6 / 6)
చిరుత కదలికలను తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు. గతంలో ఒకసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు.
ఇతర గ్యాలరీలు