తెల్లవారుతుండగానే కమ్మేసిన పొగ- గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాద హృదయవిదారకర ఫొటోలు-hyderabad fire tragedy 17 dead in gulzar house blaze heartbreaking images ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెల్లవారుతుండగానే కమ్మేసిన పొగ- గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాద హృదయవిదారకర ఫొటోలు

తెల్లవారుతుండగానే కమ్మేసిన పొగ- గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాద హృదయవిదారకర ఫొటోలు

Published May 18, 2025 02:35 PM IST Bandaru Satyaprasad
Published May 18, 2025 02:35 PM IST

హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర ఘటనపై ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

(1 / 8)

ఆదివారం ఉదయం 6 గంటల గుల్జార్ హౌస్ లోని ఓ భవనంలో మంటలు సంభవించింది. మంటలు క్రమంలో భవనం మొత్తం వ్యాపించి ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వీరిలో 14 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

(2 / 8)

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిన ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

(3 / 8)

అగ్ని ప్రమాదంపై కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనస్థలిని పరిశీలించిన ఆయన...ఒక కుటుంబానికి చెందిన ముత్యాల దుకాణంలో మంటలు చెలరేగాయని తెలిపారు. వారి ఇల్లు దుకాణం పైన ఉన్న అంతస్తులో ఉందని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు.

(4 / 8)

"ఆదివారం ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం రాగానే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. ప్రభుత్వం తరపున అని రకాల చర్యలు చేపట్టాం" అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

(5 / 8)

 ​ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

(6 / 8)

 పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర సంతాపం ప్రకటించారు.  అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి  మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

(7 / 8)

దట్టమైన పొగలో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు

(8 / 8)

దట్టమైన పొగలో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు