Hyderabad ExPerium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే
Hyderabad ExPerium Park : హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
(1 / 6)
హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు.
(2 / 6)
ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు.
(Image Source : Hi Hyderabad X Account)(3 / 6)
15,000లకు పైగా వృక్ష జాతులు, అరుదైన చెట్లు, సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్ పీరియం పార్క్ ను ఏర్పాటుచేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు.
(4 / 6)
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్కును నిర్మించారు. ఈ పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 వేల జాతుల మొక్కలను ఉంచారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను నిర్మించారు.
(Image Source : Hi Hyderabad X Account)(5 / 6)
రాందేవ్రావు ఆరున్నరేళ్లుగా పాటు శ్రమించి ఎక్స్ పీరియం పార్క్‌ను తీర్చిదిద్దారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.
(Image Source : Hi Hyderabad X Account)(6 / 6)
రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్‌పీరియం పార్కు అని నిర్వాహకులు అంటున్నారు. ఈ పార్క్ లో రూ.5 లక్షల నుంచి రూ.కోటి విలువైన శిల్పాలు ఉన్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక పార్క్ ఎక్స్‌పీరియం అని నిర్వాహకులు చెప్పారు.
(Image Source : Hi Hyderabad X Account)ఇతర గ్యాలరీలు