Mlc Kavitha : తల్లిని చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కామెంట్స్-hyderabad brs mlc kavitha reached home got emotional seeing mother shoba tied rakhi to ktr ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mlc Kavitha : తల్లిని చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కామెంట్స్

Mlc Kavitha : తల్లిని చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కామెంట్స్

Aug 28, 2024, 10:55 PM IST Bandaru Satyaprasad
Aug 28, 2024, 10:55 PM , IST

  • Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదారాబాద్ చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న కవిత తల్లి శోభ స్వాగతం పలికారు. తల్లి శోభను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదారాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

(1 / 7)

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా ఐదు నెలల తర్వాత ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు.  

(2 / 7)

శంషాబాద్ నుంచి భారీ ర్యాలీగా బంజారాహిల్స్ లో తన నివాసానికి చేరుకున్నారు కవిత. ఇంటికి చేరుకున్న కవితకు తల్లి శోభ, కేటీఆర్‌ సతీమణి  శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. 

(3 / 7)

తల్లి శోభను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత కవితను చూసిన కటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.  

(4 / 7)

తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు.  

(5 / 7)

తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. 

(6 / 7)

క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కవిత తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని తెలిపారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు