తెలుగు న్యూస్ / ఫోటో /
KCR : రాజకీయ కక్షతోనే నా బిడ్డను జైల్లో పెట్టారు, కన్న తండ్రిగా నాకు బాధ ఉండదా? - కేసీఆర్
- KCR : రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
- KCR : రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
(1 / 6)
రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేక కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
(2 / 6)
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో రెండు సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు.
(3 / 6)
నేను ఇప్పుడు అగ్ని పర్వతంలా ఉన్నాను..ఇంత కంటే క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ సాధించానని కేసీఆర్ అన్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అన్నారు.
(4 / 6)
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయిందని కేసీఆర్ అన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
(5 / 6)
ఎక్కడో ఉన్న వాళ్లను నేతలుగా చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారన్నారని కేసీఆర్ విమర్శించారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచారి కేసీఆర్ ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు