BRS Lok Sabha Candidates : సికింద్రాబాద్ బరిలో పద్మారావు గౌడ్, మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
- BRS Lok Sabha Candidates : మరో మూడు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
- BRS Lok Sabha Candidates : మరో మూడు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
(1 / 7)
మరో మూడు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Padmaroa Goud) ను కేసీఆర్ ప్రకటించారు.
(2 / 7)
బీఆర్ఎస్ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం పార్టీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతగా ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ ను సికింద్రాబాద్ నుంచి బరిలో దించాలని నిర్ణయించారు.
(3 / 7)
సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన స్థానిక నేతగా, ఆ ప్రాంత ప్రజలు ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ సరైన అభ్యర్థిగా బీఆర్ఎస్ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించడంతో కేసీఆర్ కు పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
(4 / 7)
భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్ పేరును ఖరారు చేశారు.
(5 / 7)
నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
(6 / 7)
బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీటు కేటాయించారు.
ఇతర గ్యాలరీలు