తెలుగు న్యూస్ / ఫోటో /
Balkampet Yellamma Kalyanam : కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
- Balkampet Yellamma Kalyanam : హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.

(1 / 8)
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు.
(2 / 8)
ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
(3 / 8)
బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరినీ అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాననని కిషన్ రెడ్డి అన్నారు. కల్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులతో కిషన్ రెడ్డి ముచ్చటించాను.
(4 / 8)
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారి కల్యాణానికి మంగళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
(6 / 8)
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలిగారు. ప్రొటోకాల్ పాటించట్లేదని కలెక్టర్ అనుదీప్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి కొద్దిసేపు బయటే ఉన్నారు.
ఇతర గ్యాలరీలు