తెలుగు న్యూస్ / ఫోటో /
AP TS Weather : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు, ఏపీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
- AP TS Weather : వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు(TS Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఉత్తర కోస్తా, యానాంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TS Weather : వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు(TS Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఉత్తర కోస్తా, యానాంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 8)
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు(TS Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
(2 / 8)
సెంట్రల్ మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.(pixabay)
(3 / 8)
మంగళవారం రాష్ట్రంలో దక్షిణ, ఆగ్నేయ దిశలలో కింది స్థాయి గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని పేర్కొంది. (pixabay)
(4 / 8)
తెలంగాణ గత కొన్ని రోజులు 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంగళవారం సూర్యుడు కాస్త చల్లబడి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరాడు. రాగల ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతల(Temperatures) మరింత తగ్గి పలు జిల్లాల్లో తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.(pixabay)
(5 / 8)
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రేపు(ఏప్రిల్ 10) పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు(AP Heat Wave) వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. (pixabay)
(6 / 8)
బుధవారం ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, లాగే ఎల్లుండి(ఏప్రిల్ 11న) 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ తెలిపింది. (ASDMA twitter)
(7 / 8)
రేపు మన్యంలో 2, శ్రీకాకుళం 8, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు వీలైనంతవరకు ఉదయం11 నుంచి సాయంత్రం4 వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇతర గ్యాలరీలు