తెలుగు న్యూస్ / ఫోటో /
Papua New Guinea: పపువా న్యూ గినియాలో విషాదం; కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి
Papua New Guinea: పపువా న్యూ గినియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగి పడి 100 మందికి పైగా మృతి చెందిన ఘటన పపువా న్యూ గినియాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పర్వత భాగం కింద ఉన్న గ్రామంలో రాత్రి సమయంలో భారీగా కొండ చరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
(1 / 8)
పపువా న్యూ గినియాలోని మారుమూల, పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది చనిపోయారు.(AFP)
(2 / 8)
పపువా న్యూగినియాలోని ఎంగా ప్రావిన్స్ లోని మైప్ ములిటాకాలో కొండచరియలు విరిగిపడిన ఘటన చోటు చేసుకుంది.
(AFP)(3 / 8)
పపువా న్యూగినియా రాజధాని పోర్ట్ మోరెస్బీకి వాయవ్యంగా 600 కిలోమీటర్ల దూరంలోని ఎంగా ప్రావిన్స్లోని కవోకలం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి.
(AFP)(4 / 8)
మృతుల సంఖ్య 100కు పైగానే ఉందని స్థానికులు చెబుతున్నప్పటికీ అధికారులు ఆ సంఖ్యను ధృవీకరించలేదు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని గ్రామస్తులు తెలిపారు.(AFP)
(5 / 8)
అధికారులు స్పందిస్తున్నారని, విధ్వంసం, ప్రాణనష్టంపై సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే పేర్కొన్నారు.
(AFP)(6 / 8)
'పరిస్థితిపై నాకు ఇంకా పూర్తి సమాచారం అందలేదు. అయితే, ఈ తెల్లవారు జామున కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని మరాపే ఒక ప్రకటనలో తెలిపారు.(AFP)
(7 / 8)
సమాచారం తెలియగానే పపువా న్యూగినియా స్థానిక అధికారులు, విపత్త నిర్వహణ దళం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.
(AFP)ఇతర గ్యాలరీలు