బుధుడి సంచారంతో వీరికి కలిసి రానున్న కాలం.. ఆర్థిక లాభాలతోపాటుగా అదృష్టం!
Mercury Transit : గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ 16 మధ్యాహ్నం 2.25 గంటలకు వృశ్చిక రాశిలో ప్రత్యక్ష ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. బుధుడి ఈ ప్రత్యక్ష కదలిక కొంతమంది జీవితాల్లో సానుకూల మార్పును తెస్తుంది. ఏ రాశి వారికి అదృష్టం దక్కుతుందో చూద్దాం.
(1 / 5)
బుధుడు 2025 జనవరి 4 వరకు వృశ్చికంలో ఉంటాడు. ఆ తర్వాత ధనుస్సు రాశికి వెళ్తాడు. ఆ సమయంలో బుధుడు వృషభం, మిథున రాశితో సహా 4 రాశులకు వివిధ ప్రయోజనాలను అందిస్తాడు.
(2 / 5)
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సారి శుభపరిణామం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వివిధ మార్గాల నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పనిలో మద్దతు లభిస్తుంది. పనిలో ఆటంకాలు సులభంగా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
(3 / 5)
మిథున రాశి : బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల మిథున రాశి వారికి పూర్వీకుల భూమి, ఆస్తి నుండి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక అంశాలు బలంగా ఉంటాయి. వృత్తిలో తీసుకున్న నిర్ణయాలు పురోగతికి తోడ్పడతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ పై అధికారులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. బుధుడి శుభ ప్రభావం వల్ల మీరు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు.
(4 / 5)
సింహం : బుధుడు కదలికతో సింహరాశి వారికి సంతోషం, అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయం వ్యాపార, ఉపాధికి అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు.
ఇతర గ్యాలరీలు