(1 / 5)
శ్రావణ మాసం ఆరంభం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో అంచనాలకు మించి భక్తులు దర్శనానికి తరలివస్తుండడంతో అధికారులు భక్తుల సౌకర్యార్థమై శీఘ్ర లఘుదర్శనం ఏర్పాటు చేశారు.
(2 / 5)
గర్భగుడిలోకి అర్చకులు మినహయించి వీఐపీ,స్పెషల్ దర్శనాలు,ప్రత్యేక పూజలను రద్దు చేశారు. గత మూడు రోజుల్లోనే సుమారు లక్షా ఇరవై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు.
(3 / 5)
ఆదివారం సెలవు దినం కావడంతో పాటు శ్రావణ సోమవారం, మంగళవారం రోజున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణం,కుంకుమపూజ,స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు తీర్చడానికి సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది.
(4 / 5)
సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు ఆరు గంటల నుండి పదకొండు గంటల సమయం పడుతోంది. దేవాలయ ప్రాంగణం ఎటు చూసినా జనసంద్రంగా కనబడుతుంది.
(5 / 5)
రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర,నగరేశ్వర ఆలయాలతో పాట బద్దిపోచమ్మ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాడనికి సుమారు రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శుభ ముహుర్తాలు ముగుస్తున్న తరుణంలో ముహుర్తాల కంటే ముందే మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తుడడంతో రాజన్న క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది.
ఇతర గ్యాలరీలు