(1 / 8)
వైసీపీ అధినేత జగన్ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు.జగన్ పర్యటన సందర్భంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
(2 / 8)
జగన్ రాకతో సత్తెనపల్లి పల్నాడు జిల్లా రెంటపాళ్ల కిక్కిరిసిపోయింది.ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కుటుంబాన్ని పరామర్శించారు.
(3 / 8)
జగన్ రాకతో వైసీపీ కార్యకర్తలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగారు.
(4 / 8)
నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత.. జగన్ మీడియాతో మాట్లాడారు.
“టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలయ్యాక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నాగమల్లేశ్వర రావు ఇంటిపై రాళ్లు విసిరి, అతడిని అరెస్ట్ చేయించారు. ఊళ్లోంచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించాడు. వాళ్ల బెదిరింపులు, అవమానాల గురించి తండ్రికి చెప్పి నాగమల్లేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల ప్రస్తావన తెచ్చి, అవమానించి, తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. వీరి ఇంటిపై దాడి చేసిన వారిలో ఎందరిని అరెస్ట్ చేశారు, ఎందరికి శిక్ష వేశారు అని అడుగుతున్నా? వేధించిన సీఐ మీద ఏం చర్యలు తీసుకున్నారు” అని ప్రశ్నించారు.
(5 / 8)
“రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితులు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇదే సత్తెనపల్లిలో గుత్తా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కమ్మవాడివి వైయస్ఆర్ సీపీలో ఎందుకు ఉన్నావు అంటూ డీఎస్పీ హనుమంతరావు అవమానించాడు. డీఎస్పీ హనుమంతరావు ఒక కుల ఉన్మాది. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతానని లక్ష్మీనారాయణను బెదిరించాడు. దీంతో లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మవారు ఉండొద్దా?” అని జగన్ ప్రశ్నించారు.
(6 / 8)
“చంద్రబాబుకు వత్తాసుపలుకుతున్న కొందరు పోలీసులకు చెబుతున్నా..ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండడు. మరో నాలుగేళ్లలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తానని ఖచ్చితంగా చెబుతున్నా" అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
(7 / 8)
"గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాల్లో పోలీసులు భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు వారినీ బోనెక్కిస్తామని హెచ్చరిస్తున్నాను” అని జగన్ కామెంట్స్ చేశారు.
(8 / 8)
జగన్ కు అభివాదం చెబుతున్న పార్టీ కార్యకర్తలు
ఇతర గ్యాలరీలు