Hrithika Srinivas: నాని, సాయిపల్లవి అంటే ఇష్టం - హ్రితిక శ్రీనివాస్
Hrithika Srinivas: తెలుగులో సాయిపల్లవి తన ఫేవరేట్ హీరోయిన్ అని చెప్పింది హ్రితిక శ్రీనివాస్. ఆమె హీరోయిన్‌గా నటించిన సౌండ్ పార్టీ మూవీ నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్నాడు.
(1 / 5)
సీనియర్ హీరోయిన్ ఆమని తనకు అత్తయ్య అవుతుందని హ్రితిక శ్రీనివాస్ చెప్పింది. ఆమని ద్వారానే నటనపై ఆసక్తి ఏర్పడిందని తెలిపింది. బాలనటిగా హ్రితిక శ్రీనివాస్ కొన్ని సినిమాల్లో నటించింది.
(2 / 5)
సౌండ్ పార్టీ మూవీలో సిరి అనే అమ్మాయిగా నటించినట్లు హ్రితిక శ్రీనివాస్ తెలిపింది. క్రికెట్ టీమ్‌లో ధోనీ లాంటి పాత్ర తనదని పేర్కొన్నది.
(3 / 5)
తన రియల్‌లైఫ్‌కు చాలా దగ్గరగా ఉండే పాత్రను సౌండ్ పార్టీలో చేసినట్లు హ్రితిక శ్రీనివాస్ తెలిపింది. సీరియస్‌గా సాగుతూ ఆడియెన్స్ నవ్వించే రోల్ తనదని అన్నది.
(4 / 5)
బిగ్‌బాస్‌లో కనిపించిన సన్నీకి, రియల్‌లైఫ్‌లో సన్నీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదని హ్రితిక శ్రీనివాస్ చెప్పింది. తెలుగు భాషను నేర్చుకోవడంలో తనకు వీజే సన్నీ చాలా హెల్ప్ చేశాడని అన్నది.
ఇతర గ్యాలరీలు