Oversharing: చెప్పకూడని విషయాలు చెప్పేసి బాధపడుతున్నారా? నిపుణుల సలహాలు తెల్సుకోండి
Oversharing: కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడేసి ఫీలవుతారు. అనవసరంగా ఆ విషయం, ఈ విషయం చెప్పేశామే అని బాధపడతారు. ప్రతిసారీ ఇలాగే జరిగితే మీరు మీ విషయాలు అతిగా పంచుకుంటున్నారనే అర్థం. దీన్నుంచి బయటపడేలా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
(1 / 6)
స్నేహితులతోనో, కుటుంబంతోనో కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు ఎక్కువగా చెప్పేశాం అనిపిస్తుంది. అనవసరంగా ఎక్కువగా మాట్లాడేశామే అనీ ఫీల్ అవుతాం. ఎక్కువగా మాట్లాడితేనే వాళ్లతో సరిగ్గా మాట్లాడినట్లు అనుకోవడం వల్ల అలా మాట్లాడేస్తారు చాలా మంది. కానీ అర్థవంతమైన సంభాషనలు చిన్నవి జరిగినా చాలంటారు నిపుణులు. ఇలా అతిగా విషయాలు పంచుకోవడం గురించి నిపుణుల సలహా తెల్సుకోండి. (Unsplash)
(2 / 6)
మీరు అతిగా విషయాలు పంచుకుంటున్నారని మీకు అనిపించినప్పుడు, విరామం తీసుకోండి. మీరు చెప్పబోయే విషయం సరైందో కాదో ముందుగానే ఆలోచించుకోండి.(Unsplash)
(3 / 6)
సురక్షితమైన వ్యక్తులను గుర్తించండి: ఇది చాలా ముఖ్యం. మనం పంచుకునేదాన్ని అందరూ సానుకూల రీతిలో అంగీకరించకపోవచ్చు. మనకు హాని కలిగించే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గుర్తించాలి. (Shutterstock)
(4 / 6)
హద్దులు నిర్ణయించుకోండి: సమాచారాన్ని అతిగా పంచుకోకుండా మనకంటూ వ్యక్తిగత హద్దులను నిర్దేశించుకోవాలి. (Pexels)
(5 / 6)
కొన్ని సందర్భాలు, విషయాలు మనం ఎక్కువగా మాట్లాడేలా చేస్తాయి. ఎక్కువగా ఉత్సాహం కలిగిస్తాయి. అలాంటి సందర్బాల్లో మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోగలగాలి.(Shutterstock)
ఇతర గ్యాలరీలు