భూ భారతి పోర్టల్ లో ఏ సేవను ఎలా పొందాలి.....? ప్రాసెస్ వివరాలను ఇలా తెలుసుకోండి-how to process any service through telangana bhu bharati portal user manuals available on official website ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  భూ భారతి పోర్టల్ లో ఏ సేవను ఎలా పొందాలి.....? ప్రాసెస్ వివరాలను ఇలా తెలుసుకోండి

భూ భారతి పోర్టల్ లో ఏ సేవను ఎలా పొందాలి.....? ప్రాసెస్ వివరాలను ఇలా తెలుసుకోండి

Published May 22, 2025 07:22 PM IST Maheshwaram Mahendra Chary
Published May 22, 2025 07:22 PM IST

తెలంగాణలో భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ మండలాల్లో ఈ పోర్టల్ ద్వారానే భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగానూ ఈ సేవలు ప్రారంభమవుతాయి. అయితే ఈ పోర్టల్ ద్వారా సేవలు ఎలా పొందాలో తెలుసుకునేందుకు వెబ్ సైట్ లో యూజర్ మాన్యువల్స్ ను కూడా ఉంచారు.

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో భూ భారతి పోర్టల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పలు మండలాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది.

(1 / 9)

జూన్ 2 నుంచి తహసిల్దార్ స్థాయి అధికారులు మండల పరిధిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారాలపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.  దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రకటన చేసింది. దరఖాస్తు కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొంది.

(2 / 9)

🟢జూన్ 2 నుంచి తహసిల్దార్ స్థాయి అధికారులు మండల పరిధిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారాలపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రకటన చేసింది. దరఖాస్తు కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొంది.

కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా సులభంగా సేవలను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

(3 / 9)

భూ భారతి పోర్టల్ ద్వారా ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకునేందుకు ప్రభుత్వం యూజర్ మాన్యువల్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని https://bhubharati.telangana.gov.in/homePage వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(4 / 9)

భూ భారతి పోర్టల్ రిజిస్ట్రేషన్ నుంచి నాలా వరకు ఇలా అనేక సేవలు ఉంటాయి. వీటిలో మీకు సేవ గురించి తెలుసుకోవాలో సంబంధిత ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో భూ భారతి పోర్టల్ లాగిన్ నుంచి ప్రాసెస్ పూర్తయ్యే వరకు చేయాల్సిన పూర్తి వివరాలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ తో కూడిన ఫొటోలను కూడా పీడీఎఫ్ లో పొందుపరిచారు.

(5 / 9)

యూజర్ మాన్యువల్స్ ఆధారంగా భూ పోర్టల్ సేవలను పొందే విషయంపై ఓ అవగాహనకు రావొచ్చు. వీటిని పొందేందుకు ముందుగా https://bhubharati.telangana.gov.in/homePage పోర్టల్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే User Manuals అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మొత్తం 14 సేవలకు సంబంధించిన పీడీఎఫ్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(6 / 9)

https://bhubharati.telangana.gov.in/Bhubharati_userManuals ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా తెలంగాణ భూ భారతి పోర్టల్ యూజర్ మాన్యువల్స్ లను చూడొచ్చు.

(7 / 9)

మరోవైపు తెలంగాణ భూ భారతి పోర్టల్‌లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. ఏఐ సహకారంతో ఈ పోర్టల్‌లో 'భూమిత్ర' అనే సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ ఆప్షన్ ద్వారా… భూ భారతిలో యూజర్లు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా ఈ చాట్‌ బాట్‌ పని చేస్తుందని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

(8 / 9)

రైతులు ప్రాథమికంగా ఇచ్చే వివరాలతో సరైన సమాచారం ఇవ్వడానికి ఈ భూ మిత్ర ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. హెల్ప్‌ డెస్క్‌ కింద ఈ చాట్‌బాట్‌(భూ మిత్ర)ను వినియోగించనున్నారు. రాబోయే రోజుల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా… ఎలాంటి ఇబ్బందుల లేకుండా భూ భారతి పోర్టల్ సేవలను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

(9 / 9)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు