Mumbai Budget Tour : కలల నగరం ముంబయి.. తక్కువ బడ్జెట్‌తో మూడు రోజుల్లోనే చుట్టేయొచ్చు!
- Mumbai Budget Tour : ముంబయి.. దేశంలోనే అందమైన నగరం. ఇక్కడి సంస్కృతి ఎంతో భిన్నంగా ఉంటుంది. దేశంలో పేరొందిన వ్యక్తులు ఇక్కడే నివసిస్తారు. ముంబయి సాగర తీరం మొదలు.. స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్నీ ప్రత్యేకమే. అందుకే చాలామంది ముంబయి టూర్‌కు వెళ్లాలనుకుంటారు. వారి కోసం ఈ ప్రత్యేక కథనం.
- Mumbai Budget Tour : ముంబయి.. దేశంలోనే అందమైన నగరం. ఇక్కడి సంస్కృతి ఎంతో భిన్నంగా ఉంటుంది. దేశంలో పేరొందిన వ్యక్తులు ఇక్కడే నివసిస్తారు. ముంబయి సాగర తీరం మొదలు.. స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్నీ ప్రత్యేకమే. అందుకే చాలామంది ముంబయి టూర్‌కు వెళ్లాలనుకుంటారు. వారి కోసం ఈ ప్రత్యేక కథనం.
(1 / 7)
కలల నగరం ముంబయికి వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ.. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని భయపడతారు. అయితే తక్కువ బడ్జెట్‌లోనూ ముంబయి నగరాన్ని చుట్టేయొచ్చు. అది కూడా మూడు రోజుల్లోనే. ఎలాగో ఓసారి చూద్దాం.
(2 / 7)
హైదరాబాద్ నగరం నుంచి ముంబయికి రైళ్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో వెళ్లాలనుకునేవారికి రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి ముంబయికి రైలు ప్రయాణం దాదాపు 14 నుంచి 15 గంటలు పడుతుంది. స్లీపర్ క్లాస్ టిక్కెట్లు రూ. 400 నుండి ప్రారంభమవుతాయి. ఏసీ టిక్కెట్ల ధర రూ. 1,000 నుంచి రూ. 1,800 వరకు ఉంటుంది. ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.
(3 / 7)
హైదరాబాద్ నుంచి ముంబయికి బస్సుల్లోనూ వెళ్లవచ్చు. నాన్ ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ. 900 వరకు ఉంటుంది. రద్దీ సమయాల్లో ఏసీ బస్సుల్లో రూ. 4,000 వరకు టికెట్ ధరలు ఉంటాయి. ప్రయాణం సమయం 13 నుంచి 16 గంటలు ఉంటుంది. ఇక లాంగ్ జర్నీని ఆస్వాదించాలనుకుంటే కార్ బెటర్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. షోలాపూర్, పూణే మీదుగా ముంబయికి వెళ్లే మార్గం చాలా అందంగా ఉంటుంది. ఇంధన ఖర్చులను ఫ్రెండ్స్‌తో పంచుకుంటే తక్కువ డబ్బులతో ముంబయిని చుట్టేయవచ్చు.
(4 / 7)
ముంబయి వెళ్లాక ఎక్కడ స్టే చేయాలో చాలామందికి తెలియదు. కానీ.. అక్కడ తక్కువ బడ్జెట్‌కు అనుకూలమైన హోటళ్లు, లాడ్జీలు ఉంటాయి. ఒంటరిగా వెళ్తే.. ముంబయి సెంట్రల్, మహమ్మద్ అలీ రోడ్ సమీపంలోని పాడ్‌లు, లాడ్జీలలో ఉండవచ్చు. ఒక్క రాత్రికి రూ. 800 నుంచి రూ. 1,000 వరకు ధరలు ఉంటాయి. కుటుంబం, ఫ్రెండ్స్‌తో వెళ్తే.. ముంబయి సెంట్రల్‌లో ఉండొచ్చు. ఒక్క రాత్రికి రూ. 1,500 నుంచి రూ. 2,500 ధరల్లో మంచి హోటళ్లలో గదులు లభిస్తాయి. జుహు బీచ్, బాంద్రాలోని సెలబ్రిటీ ఇళ్లకు దగ్గరగా ఉండాలంటే.. బాంద్రా, జుహు, శాంటాక్రూజ్‌లోని హోటళ్లలో గదులు అందుబాటులో ఉంటాయి. ఒక్క రాత్రికి రూ. 1,500 నుంచి రూ. 2,000 ఖర్చవుతుంది.
(5 / 7)
ముంబయి లోకల్‌లో కూడా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. లోకల్ ట్రైన్స్ ధరలు చౌకగా ఉంటాయి. డబ్బు ఆదా చేయడానికి రోజువారీ, వారపు పాస్‌ను కొనుగోలు చేస్తే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు వెళ్లాలంటే ఆటోలు, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. మొదటి రోజు బాంద్రా ఫోర్ట్, బ్యాండ్ స్టాండ్, మన్నత్ (షారూఖ్ ఖాన్ ఇల్లు)ను సందర్శించవచ్చు. సాయంత్రం జుహు బీచ్‌లో పావ్ భాజీ, వడ పావ్ వంటి స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తూ గడపాలి. అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాల కోసం.. బాంద్రా- వర్లి సీ లింక్ దగ్గరకు వెళ్లాలి.
(6 / 7)
రెండో రోజు గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి టూర్‌ను ప్రారంభించాలి. అక్కడి నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీలో వెళ్లవచ్చు. కొలాబాలోని కేఫ్ మోండేగర్‌లో భోజనం చేసి, ఆ తర్వాత మెరైన్ డ్రైవ్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. చౌపట్టి బీచ్‌లో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించవచ్చు. సీఎస్టీ, తాజ్ హోటల్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లకు రాత్రిపూట వెళ్తే బాగుంటాయి.
(7 / 7)
మూడోరోజు కాస్త రెస్ట్ తీసుకొని షాపింగ్ చేయడం మంచిది. సావనీర్‌లు, మంచి దుస్తుల కోసం కొలాబా కాజ్‌వేలో షాపింగ్ చేయాలి. సిద్ధివినాయక ఆలయం, మణి భవన్, బ్యాండ్ స్టాండ్ ప్రొమెనేడ్‌ను సందర్శించవచ్చు. వెర్సోవా బీచ్‌లో ప్రశాంతమైన సాయంత్రంతో మీ ట్రిప్‌ను ముగించవచ్చు. ముంబయిలోని ప్రతీ ప్రాంతం జీవితంలో మర్చిపోలేని అనుభవాలను అందిస్తుంది. సరైన సమయంలో టూర్ ప్లాన్ చేసుకుంటే.. తక్కువ బడ్జెట్‌లోనే టూర్ ఎంజాయ్ చేయవచ్చు.
ఇతర గ్యాలరీలు