(1 / 7)
వర్షాలు మొదలయ్యాక దోమలు పెరుగుతాయి. దోమల బెడదను నివారించడానికి పగలు లేదా రాత్రి పూట దోమతెరలు ఏర్పాటు చేయాలి. అయితే దోమతెరలో ఎల్లప్పుడూ ఉండటం సాధ్యం కాదు.. కాబట్టి ఇంట్లో నుంచి దోమలను తరిమికొట్టేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
(2 / 7)
దోమలను తరిమికొట్టడానికి చాలా మంది వివిధ కాయిల్స్, ఏరోసోల్స్ స్ప్రేలను ఉపయోగిస్తారు. అయితే అవి మానవ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మీరు వాటిని ఉపయోగించకుండా ఇంట్లోనే దోమల వికర్షకాలను తయారు చేసుకోవచ్చు.
(3 / 7)
ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. దోమలు కుట్టవు.
(4 / 7)
దోమలు, ఈగలు, కీటకాలను దూరంగా ఉంచడంలో వేపనూనె ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం 10-12 చుక్కల వేపనూనెను 30 మిల్లీ లీటర్ల కొబ్బరినూనెలో కలిపి శరీరమంతా అప్లై చేయాలి.
(5 / 7)
3 టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్స్ లో రెండు సార్లు ఉదయం, రాత్రి పూట ఇంట్లో కొడితే దోమలు దరిచేరవు.
(6 / 7)
అదేవిధంగా 10-15 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను 30 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరమంతా అప్లై చేయాలి. మీ దగ్గర దోమలు కనిపించవు.
ఇతర గ్యాలరీలు