ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - మీ కార్డులోని సభ్యుల పేర్లు ఇలా చెక్ చేసుకోండి-how to know the details of the members in your ration card in andhrapradesh know these key details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - మీ కార్డులోని సభ్యుల పేర్లు ఇలా చెక్ చేసుకోండి

ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - మీ కార్డులోని సభ్యుల పేర్లు ఇలా చెక్ చేసుకోండి

Published Jun 17, 2025 09:00 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 17, 2025 09:00 AM IST

ఏపీలో కొత్త రేషన్ కార్డుల ముంజూరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అర్హులైన వారికి కొత్త కార్డుల మంజూరుతో పాటు పేర్లను కూడా చేరుస్తున్నారు. అయితే రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి…

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొత్త కార్డులతో పాటు సభ్యుల పేర్లు చేర్చటం వంటి వాటి కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.

(1 / 7)

మే నుంచి ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.

(2 / 7)

క్యూఆర్ కోడ్‌తో ఉన్న రేషన్ కార్డులను అందిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో డేటా వివరాలు ఉండేలా రూపొందించనున్నారు.

(3 / 7)

కొత్త కార్డుల జారీతో పాటు మార్పులు, చేర్పుల వివరాల నమోదుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు మరో ఆప్షన్ తీసుకువచ్చింది.

(4 / 7)

రేషన్ కార్డులు https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp వెబ్ సైట్ లోకి వెళ్లి కార్డుపై ఉన్న సభ్యుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని సూచించింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.

(5 / 7)

మరోవైపు బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తు్న్నట్లు తెలుస్తోంది.

(6 / 7)

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సాయంతో రేషన్ కార్డుల సర్వే చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అనర్హులను గుర్తించేందుకు ఈ సర్వే చేయనున్నారు. దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు