తెలుగు న్యూస్ / ఫోటో /
Suicidal Thoughts | వారిలో వారు కుమిలిపోతున్నారంటే ఆత్మహత్యకు సంకేతం కావచ్చు, ఇవి గమనించారా?
- ఎవరైనా క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే, ఆ బాధ ఎంతలా ఉంటుందో వారితో అనుబంధం ఉన్నవారికే తెలుస్తుంది. అయితే ఆత్మహత్యను నివారించడంలో మొదటి అడుగు వారిలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించడం. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.
- ఎవరైనా క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే, ఆ బాధ ఎంతలా ఉంటుందో వారితో అనుబంధం ఉన్నవారికే తెలుస్తుంది. అయితే ఆత్మహత్యను నివారించడంలో మొదటి అడుగు వారిలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించడం. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.
(1 / 11)
మన దేశంలో ఏటా లక్ష మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2020 గణాంకాల ప్రకారం, సగటున రోజుకు 449 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు వివిధ కారణాలు ఉన్నాయి - మానసిక ఆరోగ్య సమస్యలు, కెరీర్ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల మధ్య సమస్యలు, వ్యసనాలు, దీర్ఘకాలికమైన అనారోగ్యం, వేధింపులు, హింస మొదలైనవి. అయితే ఆత్మహత్య చేసుకొనే వారు కొన్ని సంకేతాలను గుర్తిస్తారు. అవి ఎదుటి వారు గుర్తించి, ధైర్యం చెబితే ఆత్మహత్యను నివారించవచ్చునని ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్ లో మానసిక వైద్యురాలైన డాక్టర్ జల్పా భూటా వివరించారు. (Pixabay)
(2 / 11)
మీకు బాగా కావలసిన వారు లేదా మీకు తెలిసిన వారు ఎల్లప్పుడూ ముభావంగా ఉంటూ, అందరికీ దూరంగా ఉండటం. ఏవేవో సాకులు చెప్పి ప్లాన్‌లను వంటివి చేస్తే వారు నిరాశలో ఉన్నట్లు సంకేతం కావచ్చు, అటువంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. (Pixabay)
(3 / 11)
వినోద కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, వారికి ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండటం, సంతోషం లేకపోవటం, లేదా సంతోషం నటించడం కూడా ఓ సంకేతం.(Pixabay)
(4 / 11)
జీవితం విలువైనది కాదని మాట్లాడటం, తమ జీవితంలో ఏమీ మిగల లేదని భావించే వారు వెంటనే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా వైద్యుడిని సంప్రదించాలి.(Pixabay)
(5 / 11)
తమకు ఇష్టమైన వాటిని ఇతరులకు ఇచ్చేయటం, స్నేహితులకు అసందర్భోచితంగా ఉత్తరాలు రాయడం, ఫోన్ కాల్ చేసి చివరిసారిగా మాట్లాడుతున్నట్లు మాట్లాడటం, మెసేజులు చేయడం, జీవితం ముగింపు గురించి మాట్లడటం చేస్తే, వెంటనే స్పందించి వారి వద్దకు వెళ్లాలి. (Pixabay)
(6 / 11)
ఎవరైనా చివరి ప్రయత్నంగా స్నేహితులు, నిపుణులు లేదా కుటుంబ సభ్యుల నుండి సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, మీరు వారి మాట వినాలి.(Pixabay)
(7 / 11)
ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎప్పుడూ నిస్సహాయంగా, విషయాల గురించి ప్రతికూలంగా మాట్లాడతాడు.(Unsplash)
(10 / 11)
ఎవరిలో అయినా పైన హెచ్చరిక సంకేతాలను గమనిస్తే, వారికి ఆ పరిస్తితుల్లో భావోద్వేగపరమైన మద్దతు అవసరం. ఆ వ్యక్తితో ఉండటమే కాకుండా, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి, ఒకరి ప్రాణాన్ని కాపాడాలని డాక్టర్ భూటా పేర్కొన్నారు. (Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు