(1 / 6)
ఇటీవల హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో పోలీసులు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని శుభకార్యాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం వారాల తరబడి నిల్వ చేయబడిందని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.
(istockphoto)(2 / 6)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుళ్లిన మాంసం నిల్వచేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, మాంసం, నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్లిన మాంసం, కల్తీ ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
(istockphoto)(3 / 6)
మీరు కొనే మాంసం శుభ్రంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కల్తీ మాంసం రంగులో మార్పులు కనిపిస్తాయి. చికెన్ అయితే గులాబీ రంగులో ఉంటే మంచిదని భావించాలి. నిల్వ చికెన్ అయితే కొంచెం పసుపు రంగులో కనిపిస్తుంది.
(istockphoto)(4 / 6)
మటన్ ఐతే బాగా ఎరుపురంగులో ఉంటే అది ముదిరిందని అర్థం. కాస్త తెల్లగా, గులాబీ రంగులో ఉన్న మాసం మంచిది. పసుపు, గోధుమ రంగులో ఉన్న మాంసం నిల్వ ఉన్నదని అర్థం చేసుకోవాలి. తాజా మాంసానికి సహజమైన వాసన ఉంటుంది. కల్తీ మాంసం దుర్వాసన వస్తుంది.
(istockphoto)(5 / 6)
తాజా మాంసం గట్టిగా ఉంటుంది. కల్తీ మాంసం మెత్తగా లేదా జిగటగా ఉంటుంది. మాంసం కండరాలతో దృఢంగా ఉంటే అది మంచిది. కొన్నిసార్లు లేత మాంసం మృధువుగా ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉంటే పీచులాగా ఉంటుంది. కొన్ని చోట్ల దృఢంగా, కొన్ని చోట్ల లేతగా ఉండకూడదు.
(istockphoto)ఇతర గ్యాలరీలు